గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాయల్ పార్క్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి వెనుక ఉన్న అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తులో గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఫ్లాట్‌లోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఆంధ్రప్రదేశ్
మంగళగిరి అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం


