ములుగు మున్సిపల్ పన్నులపై ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవమని కాంగ్రెస్ జిల్లాఅధికార ప్రతినిధి చింతనిప్పుల బిక్షపతి అన్నారు. 2019 మున్సిపల్ చట్టం ప్రకారమే కమర్షియల్ పన్ను 0.30 శాతం, రెసిడెన్షియల్ పన్ను 0.20 శాతంగా కౌన్సిల్ నిర్ణయించిందన్నారు. వ్యాపారుల ఇబ్బందులను మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లామని, చట్టపరిధిలో పన్నుల పునఃపరిశీలనకు చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ
పన్నులపై పునఃపరిశీలనకు సిద్ధం: కాంగ్రెస్


