హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తోటి ఉద్యోగికి అండగా నిలిచిన హోంగార్డులు

PLD: నరసరావుపేట రూరల్ పిఎస్‌లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన హోంగార్డు ఎస్. నాగేశ్వరరావుకు జిల్లా హోంగార్డులు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా సేకరించారు. సమకూరిన రూ.5,00,000 చెక్కును జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి గురువారం నాగేశ్వరరావుకు అందజేశారు. తోటి ఉద్యోగి పట్ల హోంగార్డుల ఐక్యత, మానవతా దృక్పథం అభినందనీయమని ఎస్పీ కొనియాడారు.