హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 28న విజయవాడలో రైతు సంఘాల నిరసన

NTR: విజయవాడలోని లెనిన్ సెంటర్‌లో ఈ నెల 28న రైతు సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టనున్నాయి. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్‌లో రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. రైతులకు పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక సాయం అందించాలని వారు డిమాండ్ చేశారు.