NLR: పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 21న కైశిక ద్వాదశి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కలశాభిషేకం, సాలగ్రామ దాత్రి పూజలు, వనభోజనాలు, బంగారు గరుడసేవ నిర్వహించనున్నారు. అయితే ఆరోజు కల్యాణోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేసినట్లు ఆలయ ఉప కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
పెంచలకోనలో 21న కైశిక ద్వాదశి వేడుకలు


