హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీ రామయ్యను అభినందించిన స్థానిక నేతలు

ప్రకాశం: కొండేపి మండల పరిషత్ అధ్యక్షుడిగా (ఎంపీపీ) గొర్రెపాటి రామయ్య చౌదరి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. కొండేపి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.