హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేడి నూనె ఒంటిపై పడి వ్యక్తికి తీవ్ర గాయాలు

అన్నమయ్య: గాలివీడు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఎన్నిక సందర్భంగా భోజనానికి వచ్చిన శ్రీనివాసులు (50) ప్రమాదవశాత్తు వేడి చికెన్ నూనె ఒంటిపై పడటంతో గాయపడ్డాడు. మద్యం మత్తులో ఉన్న ఆయన నూనె వద్దకు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. గమనించిన స్థానికులు అంబులెన్స్‌లో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.