హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పామిడిలో 48 మంది నామినేషన్ దాఖలు

ATP: పామిడి మండల కేంద్రంలో గ్రామ సర్పంచుల నామినేషన్లు రెండవ రోజు గురువారం కొనసాగాయి. మొత్తం పామిడి మండలంలో 20 గ్రామ పంచాయతీలకు రెండవ రోజు 48 మంది సర్పంచ్ అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారని ఎన్నికల అధికారి సౌజన్యకుమారి మీడియాకు తెలిపారు. రేపటితో నామినేషన్ల గడువు పూర్తవుతుందని ఆమె పేర్కొన్నారు. నామినేషన్ సెంటర్ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.