హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉంగుటూరులో ఎన్నికల అధికారులకు శిక్షణ: MPDO

ELR: ఉంగుటూరులోని పాతూరి కళ్యాణ మండపంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎన్నికల అధికారులకు శిక్షణ నిర్వహించనున్నారు. మొత్తం 405 మంది సిబ్బందికి శిక్షణ ఇవ్వనుండగా, వీరిలో 191 మంది ప్రిసైడింగ్, 214 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఉన్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామపంచాయతీ ఎన్నికల విధులపై శిక్షణ ఉంటుందని ఎంపీడీవో జి.ఆర్. మనోజ్ తెలిపారు.