AKP: నక్కపల్లి ఉపమాక వేంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. నక్కపల్లి మండల MPTC సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆమెకు అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు. రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
ఉపమాక వెంకన్నను దర్శించుకున్నహోంమంత్రి


