హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష

ADB: అతివేగంతో వాహనం నడిపి ఒకరి మృతికి కారణమైన నిందితుడికి ఆదిలాబాద్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించినట్లు జిల్లా న్యాయమూర్తి దివ్య వాణి గురువారం తెలిపారు. 2018లో సవాపూర్ వెళ్తున్న అరికెలా రవి బైక్‌ను కేంద్ర సాంబాజీ తన వాహనంతో ఢీకొట్టగా, రవి మృతి చెందాడు. జైనథ్ పోలీసుల దర్యాప్తు, పీపీ వాదనలతో నేరం రుజువు అయినట్లు పేర్కొన్నారు.