హైదరాబాద్: 28°C
క్రైమ్

15 ఎకరాల పంటలు అగ్నికి ఆహుతి

TG: వికారాబాద్ జిల్లా పరిగి మండలం లఖ్నాపూర్ వద్ద పంట పొలాల్లో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో సమీప పొలాలకు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సుమారు 15 ఎకరాల్లోని మొక్కజొన్న, కంది పంటలు దగ్ధమయ్యాయి. రైతు అంజయ్యకు చెందిన 10 ఎకరాల పంట, నాగరాజుకు చెందిన 2 ఎకరాల కంది పంటతో పాటు యాదయ్య మొక్కజొన్న కుప్ప కాలిబూడిదయ్యాయి. ఈ ఘటనతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు.