పంజాబ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పటియాలాలో భాక్రా కెనాల్ వద్ద ఇనుప వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. వంతెనపై నుంచి రెండు ట్రక్కులు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. శిథిలాల కింద రెండు వాహనాలు చిక్కుకుపోగా.. ఒక దాంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు.
క్రైమ్
కూలిన ఇనుప వంతెన.. చిక్కుకున్న వాహనాలు


