హైదరాబాద్: 28°C
వార్తలు

'అజిత్ దోవల్‌కు సమన్లు చేరవేయండి'

భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రా మాజీ చీఫ్ సామంత్ గోయల్‌కు అమెరికాలోని ఫెడరల్ కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. వారికి ఆ సమన్లు అందేలా సహకరించాలని ఢిల్లీ కోర్టులను అమెరికా కోర్టు కోరింది. ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ దాఖలు చేసిన దావాపై విచారణకు సంబంధించి ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటికే ఈ సమన్లను ఫెడరల్ కోర్టు.. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు పంపించింది.