AP: నంద్యాల జిల్లా బనగానపల్లె మేజర్ పంచాయతీ సర్పంచి పదవికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బనగానపల్లె ఎంపీడీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. పంచాయతీని అభివృద్ధిలో ఆదర్శంగా నిలపడమే తన లక్ష్యమని ఆమె తెలిపారు.
వార్తలు
సర్పంచి బరిలో మంత్రి సతీమణి


