హైదరాబాద్: 28°C
క్రైమ్

మండీ బిర్యానీ.. 9 మందికి ఫుడ్ పాయిజన్

TG: హైదరాబాద్‌ అంబర్‌పేటలోని గాంధీబొమ్మ సమీపంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. మండీ బిర్యానీ తిని ఒకే కుటుంబంలో 9 మంది అనారోగ్యానికి గురయ్యారు. బిర్యానీ తిన్న కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఓ మహిళకు న్యూరో సమస్య ఉండగా పరిస్థితి విషమించింది. ఫుడ్ పాయిజన్ బాధితుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు.