హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి: కలెక్టర్

సత్యసాయి: విద్యార్థులు చిన్ననాటి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సూచించారు. కొత్తచెరువు జెడ్పీహెచ్ పాఠశాలలో నిర్వహించిన జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా స్థాయి ప్రదర్శనలో 70 విద్యార్థి బృందాలు పాల్గొన్నాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన 7 ఉత్తమ ప్రాజెక్టులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు.