హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హిందూపురం వైస్ చైర్మన్ ఎంపికపై పార్టీ హెచ్చరిక..!

సత్యసాయి: హిందూపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎంపికపై పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా కొందరు నాయకులు, కౌన్సిలర్లు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ కార్యాలయ రాజకీయ సమన్వయకర్త పి. శ్రీనివాసులు తెలిపారు. వైస్ చైర్మన్ నియామకంపై ఎమ్మెల్యే బాలకృష్ణ పార్టీ అధిష్ఠానం సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటారని, అనవసర రాజకీయాలు చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.