హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంతర్జాతీయ సదస్సుకు అమలాపురం వైద్యుడికి ఆహ్వానం

కోనసీమ: అమలాపురానికి చెందిన ప్రముఖ హోమియో వైద్యులు డా. బి.ఎస్. మోహన్‌కు హైదరాబాద్‌లో జరిగే అంతర్జాతీయ హోమియోపతి సదస్సుకు ప్రత్యేక ఆహ్వానం అందింది. నవంబర్ 21, 22 తేదీల్లో నిర్వహించే ఈ సదస్సులో ఆయన కాన్ క్లేవ్ ఫ్యాకల్టీగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పరిశోధనా పత్రాన్ని సమర్పించనున్నారు. యువ వైద్యులు డా. విస్సా దయానిధి కూడా పరిశోధనా పత్రం సమర్పించనున్నారు.