హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

24 ఏళ్లకే ఎంపీపీగా అతికారి వినుత

KDP: వైద్య, విద్యను అభ్యసిస్తూనే ప్రజాసేవలోకి అడుగుపెట్టిన అతికారి వినుత సిద్దవటం మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనసేన పార్టీకి చెందిన ఆమె కేవలం 24 ఏళ్ల వయసులోనే ఎంపీపీ పీఠాన్ని అధిష్ఠించడం విశేషం. యువ వయసులోనే ప్రజాప్రతినిధిగా బాధ్యతలు చేపట్టడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఆమె నాయకత్వంలో మండల అభివృద్ధికి కృషి జరగాలని ఆకాంక్షించారు.