హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రండి: వెంకటరామిరెడ్డి

ATP: స్థానిక ఎన్నికల్లో కూటమి నేతలు తీరు ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేలా ఉందని జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. శింగనమల ఎంపీపీ ఎన్నికలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే పదవులకు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో గెలవాలని కూటమి నేతలకు సవాల్ విసిరారు.