సత్యసాయి: జిల్లాలో SIR సందర్భంగా ముసాయిదా ఓటర్ల జాబితాలో ASDD (గైర్హాజరు, వలస, మరణించిన, డూప్లికేట్)గా గుర్తించిన ఓటర్లకు మరో అవకాశం కల్పించినట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. అర్హులు నవంబర్ 30లోగా ఎన్యూమరేషన్ ఫారాలను ERO, AERO లేదా BLOలకు సమర్పించాలి. ఆమోదం పొందిన వారి పేర్లు డిసెంబర్ 22న ప్రచురించే తుది జాబితాలో చేర్చనున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ముసాయిదా జాబితాలో లేని ఓటర్లకు మరో అవకాశం


