ATP: అనంతపురంలో ప్రపంచ వారసత్వ వారోత్సవాల్లో భాగంగా ‘మ్యూజియం చూద్దాం రండి’ పేరుతో హెరిటేజ్ వాక్ నిర్వహించారు. SSBN కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ కల్లూరు సుబ్బారావు జిల్లా మ్యూజియం వరకు సాగింది. అసిస్టెంట్ కలెక్టర్ సుయశ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. యువత చారిత్రక కట్టడాలు, సంస్కృతి, వారసత్వ సంపదను కాపాడాలని ఈ సందర్భంగా వక్తలు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
అనంతపురం చరిత్ర, వారసత్వంపై హెరిటేజ్ వాక్


