BPT: కర్లపాలెం పీహెచ్‌సీ పరిధిలోని బోలయపాలెం ఎంపీ ప్రాథమిక పాఠశాలను DMHO డాక్టర్ ఎస్. విజయమ్మ గురువారం సందర్శించి పాఠశాల ఆరోగ్య కార్యక్రమం అమలును సమీక్షించారు. విద్యార్థులకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ (ఐఎఫ్‌ఏ) మాత్రల పంపిణీని పరిశీలించి, రక్తహీనత నివారణకు అర్హులైన పిల్లలందరికీ క్రమం తప్పకుండా మాత్రలు అందేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బోలయపాలెం పాఠశాలను సందర్శించిన DMHO


