హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ

AKP: గ్రామపంచాయతీ, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి మూడో విడత ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినట్లు ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గొలుగొండ మండలానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను మండల పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయ నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచినట్లు గురువారం వెల్లడించారు. కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.