హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్కాపురంలో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం

ప్రకాశం: మార్కాపురం జవహర్‌నగర్ కాలనీలో గురువారం తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం విక్రయ కేంద్రాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లా వినియోగదారుల రక్షణ కౌన్సిల్ అధ్యక్షుడు ఓరుగంటి మల్లిక్ ప్రారంభించారు. 26 కిలోల బియ్యం బస్తాను రూ.1,300కే విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఆధార్ కార్డుపై ఒక్కో కుటుంబానికి ఒక బస్తా అందజేస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.