హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన డైట్ లెక్చరర్

NLR: అల్లూరు పట్టణంలోని RDR మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలను గురువారం పల్లిపాడు డైట్ లెక్చరర్ విజయ చంద్ర సందర్శించారు.1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు సులభతర బోధన చేస్తూ వారిలో సామర్థ్యాలను పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.