హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'టికెట్ ఇవ్వకపోయినా జనసేన గెలుపు కోసం కృషి చేస్తా'

కాకినాడ మేయర్ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వనప్పటికీ జనసేన పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తానని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కాకినాడలోని తన నివాసంలో మీడియాతో ఆమె మాట్లాడారు. గత 12 ఏళ్లుగా జనసేన వీర మహిళగా పనిచేస్తున్నానని, ప్రస్తుతం కార్పొరేషన్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నానని తెలిపారు.