హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోత్కూర్‌లో ఇందిరా గాంధీ జయంతి

BHNG: మోత్కూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. మండల అధ్యక్షుడు బాలరాజు, పట్టణ అధ్యక్షుడు నాగార్జున రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న సోమ నర్సయ్య , ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు సోమిరెడ్డి పాల్గొన్నారు.