హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు మధ్యాహ్నం జెడ్పీ ఛైర్‌పర్సన్ ఎన్నిక : కలెక్టర్

కడప జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికలు ఈ నెల 20వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సమయం మార్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. అదే రోజు జరగాల్సిన కో-ఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక వాయిదా పడిందని పేర్కొన్నారు.