MLG: ఆసరా పింఛన్లు మంజూరు చేయిస్తామంటూ దళారులు డబ్బులు అడిగితే ఇవ్వవద్దని ఏటూరునాగారం సర్పంచ్ కాకులమర్రి శ్రీలత-లక్ష్మణ్ బాబు సూచించారు. పింఛన్ పేదల హక్కు అని, అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా తన దృష్టికి లేదా గ్రామపంచాయతీ కార్యాలయానికి తీసుకురావాలని కోరారు.
తెలంగాణ
పింఛన్ల పేరుతో డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయండి


