హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిగామ ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఏకగ్రీవం

SKLM: నందిగాం మండల పరిషత్ అధ్యక్షురాలిగా మోహినీ, ఉపాధ్యక్షురాలిగా బెండి రాణమ్మ గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పరిషత్ కార్యాలయంలో తొలుత నూతనంగా ఎన్నికైన 14 మంది ఎంపీటీసీ సభ్యులతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జరిగిన ఎన్నికలో సభ్యులు వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు నూతన పాలకవర్గాన్ని అభినందించారు.