హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉండి ఎంపీపీగా ఇర్రింకి లావణ్య ఏకగ్రీవ ఎన్నిక

W.G: ఉండి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా చెరుకువాడకు చెందిన టీడీపీ ఎంపీటీసీ ఇర్రింకి లావణ్య గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. వైస్ ఎంపీపీగా ఉండి-1కు చెందిన జనసేన ఎంపీటీసీ అడపా శివశంకర్ గణేష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.