హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలకు దూరంగా నార్త్ మోపూరు గ్రామస్తులు

NLR: అల్లూరు, సింగపేట, నార్త్ మోపూరు గ్రామపంచాయతీలను కలిపి రాష్ట్ర ప్రభుత్వం నగర పంచాయతీగా ఏర్పాటు చేసింది. ఇటీవల నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో నార్త్ మోపూరు గ్రామానికి సంబంధించిన 13,14,15,16 వార్డుల్లో ఎవరు కూడా నామినేషన్ వెయ్యలేదు. రాబోయే నగర పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు తెలియజేశారు.