హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది'

కృష్ణా: గుడివాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కూటమి బలపరిచిన టీడీపీ ఛైర్మన్ అభ్యర్థి మరీదు కరుణ గురువారం పాల్గొన్నారు. ఆమె పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తూ, ప్రజలను కలిసి కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని కోరారు. ప్రజల ఆదరణతో గుడివాడ అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉందని, పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు.