హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జోరుగా ఎన్నికల ప్రచారం..!

VZM: M.పాలెంలో ఇవాళ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ముదునూరు కృష్ణమూర్తి రాజు ఇంటింటా తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామ ప్రజలను ఆత్మీయంగా కలుసుకుని, వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్నసమస్యలను తెలుసుకుని, తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.