హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధర్మవరంలో బీజేపీలోకి 50 కుటుంబాలు

సత్యసాయి: ధర్మవరంలోని 6వ వార్డుకు చెందిన సుమారు 50 కుటుంబాలు బీజేపీలో చేరాయి. వార్డు ఇంఛార్జ్ సోమ్లా నాయక్ ఆధ్వర్యంలో గురువారం ఎన్డీఏ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో శివప్ప, మళ్లీ శెట్టి మురళి, లచ్చి, బుట్ట హరితో పాటు పలువురు పార్టీలో చేరారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గ ఇన్‌చార్జి హరీష్ బాబు, బీజేపీ నాయకులు వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.