హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళల సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మహిళా గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్లా మాధవి పాల్గొన్నారు. మహిళల సమస్యలపై ఎమ్మెల్యే మాధవి స్వయంగా అర్జీలను స్వీకరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గురువారం అందుబాటులో ఉండి, మహిళల సమస్యల పట్ల ఫిర్యాదులు స్వీకరిస్తామని అన్నారు. మహిళలు స్వేఛ్ఛగా వచ్చి వారి సమస్యలను తెలపాలని పేర్కొన్నారు.