KMM: కార్తీకమాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం మధిర ఆర్టీసీ డిపో నుంచి పంచారామ క్షేత్రాలు, అరుణాచలం, శబరిమల తదితర పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ డి. దేవరాజు తెలిపారు. బుధవారం వైరా బస్టాండ్‌ను సందర్శించి బస్సులు, కార్గో కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు


