హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కౌతాళం సర్పంచ్ అభ్యర్థిగా నాగమణి నామినేషన్

KRNL: కౌతాళం మేజర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన అల్లూరి నాగమణి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే నాలుగు వార్డులకు కూటమి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అక్కమ్మతోట రామకృష్ణ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉలిగయ్య పాల్గొన్నారు. పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.