హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోని రెండు మండలాల్లో ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవం

KRNL: ఆదోని మండలం-1, మండలం-2ల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులకు ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం నూతన ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మార్గదర్శకత్వంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తయింది. నూతన ప్రజాప్రతినిధులకు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.