హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 20న జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక

అన్నమయ్య జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికలు ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. అదే రోజు జరగాల్సిన కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక వాయిదా పడినట్లు వెల్లడించారు. తదుపరి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొత్త తేదీ ప్రకటిస్తామని పేర్కొన్నారు.