హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలు

కోనసీమ: మండపేటలో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 109వ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ కామన ప్రభాకరరావు ఆమె చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరాగాంధీ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆమె ఆశయాలను కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.