హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీగా గవరలక్ష్మి ప్రమాణ స్వీకారం

W.G: ఆకివీడు మండల పరిషత్ అధ్యక్షురాలిగా గవర లక్ష్మి (జనసేన) గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమెతో పాటు ఎంపీటీసీ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు హాజరయ్యారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు.