హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: ఐజీ

ఏలూరులోని ఆశ్రమ మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్, ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ పాల్గొని ర్యాగింగ్‌కు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూనియర్లతో స్నేహపూర్వకంగా మెలగాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.