హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

21న ఎద్దుల బహిరంగ వేలం

ATP: అనంతపురం ఖైదీల వ్యవసాయక్షేత్రానికి చెందిన ఉత్పాదకత లేని 15 ఎద్దులను ఈ నెల 21న బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక పశువుల సంత మార్కెట్‌లో వేలం నిర్వహించనున్నట్లు పర్యవేక్షణాధికారి ఎస్. కిషోర్ కుమార్ తెలిపారు. ఆసక్తి గల కొనుగోలుదారులు జైలు వద్ద వివరాలు తెలుసుకుని వేలంలో పాల్గొనవచ్చని సూచించారు.