హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోడలు ఎంపీపీ.. అత్త ఎంపీటీసీ

ELR: గణపవరం మండలంలో అత్తాకోడళ్లు ఎంపీటీసీలుగా గెలిచారు. జల్లి కాకినాడ నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన కోడలు తానేటి భారతి.. గణపవరం మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఇవాళ ఎన్నికయ్యారు. ఆమె అత్త తానేటి లక్ష్మీకాంతం సీహెచ్ అగ్రహారం నుంచి ఎంపీటీసీగా గెలుపొందారు. తమ విజయానికి కృషి చేసిన ఎమ్మెల్యే ధర్మరాజు, కార్యకర్తలకు, నాయకులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.