హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఖాజీపేట మండల ఎంపీపీగా పల్లె నీరజ

KDP: ఖాజీపేట మండల పరిషత్ భవనంలో గురువారం నూతన మండల పరిషత్ అధ్యక్షురాలిగా పల్లె నీరజ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నూతన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.