WG: నరసాపురం ఎంపీపీగా టీడీపీకి చెందిన వాతాడి ఉమా, వైస్ ఎంపీపీగా జనసేనకు చెందిన రావూరి సురేశ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి జి. సునీత ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన వారికి ఆమె ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ వారిని అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
నరసాపురం ఎంపీపీగా వాతాడి ఉమా ఏకగ్రీవ ఎన్నిక


