హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

చలికాలంలో కీళ్ల నొప్పులు ఎందుకొస్తాయంటే..?

చలికాలంలో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల కండరాలు, కణజాలాలు బిగుసుకుంటాయి. అలాగే రక్తప్రసరణ మందగించి కీళ్లలో ద్రవం చిక్కబడుతుంది. వాతావరణ పీడన మార్పులు కీళ్లపై ఒత్తిడి పెంచుతాయి. దీనివల్ల మోకాళ్లు, ఇతర కీళ్లలో నొప్పులు, బిగుతు పెరుగుతాయి. రోజూ తేలికపాటి వ్యాయామం, వేడి నీటి కాపడం, వెచ్చని దుస్తులతో ఉపశమనం లభిస్తుంది.